రైతులు కుప్పకూలుతున్నా కనికరం లేదా!
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనికరం లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చౌటుప్పల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
- ముఖ్యమంత్రిని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్ రావు
- చౌటుప్పల్‌లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి
- ధాన్యం కుప్పల వద్దే రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతుల ఆవేదనను తెలుసుకున్న హరీశ్ రావు
చౌటుప్పల్, మే 7 : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనికరం లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చౌటుప్పల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం కుప్పల వద్దే నిరీక్షిస్తున్న రైతులతో మాట్లాడారు. నెలరోజులైనా వడ్లు కొంటలేరని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మాయిశ్చర్ తీసిన తర్వాత రోజే కాంటాలు వేసేదని..ప్రస్తుతం వారం గడుస్తున్న వెయ్య డం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. మరికొంత మంది రైతులు తమ ధాన్యానికి బీ గ్రేడ్ వేస్తున్నరని చెప్పారు. దీంతో ఎకరాకు 600-700 వరకు నష్టపోతున్నామని హరీశ్‌రావుకు వివరించారు. గత ప్రభుత్వం ఏనాడూ బీ గ్రేడ్ వేయలేదని రైతులు గుర్తు చేశారు.
కొనుగోలు కేంద్రం నుంచి రోజుకు రెండు లారీ లు కూడా పోవడం లేదన్నారు. హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో ఈరోజు 7.30 గంటలకే కాంటాలు వేశారన్నారు. అంతకుముందు 11 గంటల తర్వాత జోకేదని వివరించారు. చదువు రాకనే వ్యవసాయం చేస్తున్నామని, ఆన్లైన్లో యూరి యా బుక్ చేసుకొని ఓటీపీ ఎలా చెప్పగలుగుతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతుబంధు నెలకోసారి బిచ్చం వేసినట్లు వేస్తున్నారన్నారు. దీంతో వ్యవసాయ పనులకు సక్రమంగా వినియోగంచుకోలేక పోతున్నామన్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్‌మీట్ పెట్టి మేం చాలా బాగా వడ్లు కొంటున్నాం. ఎవరికీ ఇబ్బంది లేదు అని గొప్పలు చెప్పారన్నారు.
అయ్యా ఉత్తమ్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
‘అయ్యా ఉత్తమ్ నేను ఏసీ రూంలో కూర్చొని మాట్లాడం లేదు. నీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా ఒక్కసారి ఇక్కడకు వచ్చి చూడాలని’ చురుకలు వేశారు. ఇక్కడ ధనమ్మ, నిర్మల అనే మహిళా రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చి 24 రోజులైంది. ఏప్రిల్ 30న మాయిశ్చర్ వచ్చినా గత 8 రోజులుగా కాంటా పెట్టే దిక్కేలేదన్నారు. 44 డిగ్రీల ఎండలో సైతం రైతులు నెల రోజులుగా వడిగాపులు కాస్తూ పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. ఇది పూర్తిగా మీ ప్రభుత్వ చేతగానితనమే అంటూ విమర్శించారు. మాయిశ్చర్ ఇవ్వడానికి పది రోజులు, సంచులివ్వడానికి వారం, కాం టాకు వారం మిల్లుకు వెళ్లడానికి మరో వారం పడుతోందని ఆయన మండిపడ్డారు. తీరా మిల్లుకు వెళ్లాక తాలు ఉందని చెప్పి లారీకి 4,5 బస్తాలు కటింగ్ పెడుతుంటే ఏమీ చేస్తున్నారని ప్రశ్నంచారు. తాను మార్కెట్‌కు వస్తున్నాని తెలిసి ఈ రోజు 4,5 లారీలు పంపించారు.. మేమోస్తే తప్ప మీరు లారీలు పంపరా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా వాతావరణ శాఖ అకాల వర్షాలు, తుపాను హెచ్చరికలు జారీ చేస్తోంది. వర్షం వస్తే చౌటుప్పల్ మార్కెట్ అంతా నీట మునిగి, వడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. ప్రభు త్వం తక్షణమే మేల్కొని సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పం పాలన్నారు. మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కలు ్లగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, కర్నాటి విద్యాసాగర్, చింతల దామోదర్ రెడ్డి, కర్నాటి వెంకటేశం, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, గిర్కటి నిరంజన్ గౌడ్, కొయ్యాడ శేఖర్ గౌడ్, సుర్వి మల్లేశ్ గౌడ్, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సుర్కంటి శ్రీధర్ రెడ్డి, తాడూరి పరమేశ్, ఢిల్లీ మాధవరెడ్డి, ఉడుగు మల్లేశం గౌడ్, దేవరపల్లి గోవర్దన్ రెడ్డి, గుండెబోయిన ఇస్తారి యాదవ్, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, ఊదరి యాదయ్య, గడ్డం రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

