నేడు జిల్లాకు మంత్రుల రాక
హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యాలయాలు, రైతు వేదికలు, బస్తీ, పల్లె దవాఖానలు ప్రారంభోత్సవం.
- అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనచేయనున్న హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి
- మిర్యాలగూడ, మఠంపల్లిలో ఆత్మీయ సమ్మేళనం
నేరేడుచర్ల, మే 25 : హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యాలయాలు, రైతు వేదికలు, బస్తీ, పల్లె దవాఖానలు ప్రారంభోత్సవం. హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. మఠంపల్లిలో శ్రీకాంతాచారి, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్ల పరిశీలన
మఠంపల్లి : మండల కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. స్నేహపూర్వక వాతావరణంలో సమ్మేళనం నిర్వహించేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఆత్మీయ సమ్మేళనం అనంతరం మట్టపల్లి నృసింహుడిని మంత్రులు దర్శించుకొనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మిర్యాలగూడలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన
మిర్యాలగూడ, మే 25 : మిర్యాలగూడలోని ఏరియా దవాఖానలో రూ.14కోట్లతో చేపట్టనున్న మరో 100 పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా నియోజకవర్గవ్యాప్తంగా 28 ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.5.60కోట్లను మంజూరు చేయగా వాటి నిర్మాణ పనులకు ప్రారంభించనున్నారు. ముందుగా వేములపల్లి మండలంలో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని, మిర్యాలగూడలోని ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానాను ప్రారంభించనున్నారు. అనంతరం క్యాంపు మైదానంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

