కట్టంగూర్/చిట్యాల, జూన్ 2: మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, మిర్యాగూడ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్, భాస్కర్‌రావు, జడ్పీమాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.