నీలగిరి, జూన్ 26 : నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావికి చెందిన బీటెక్ విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థిని టి.సింధూజకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గురువారం ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పాదూరి ఇంద్రసేనారెడ్డి కుమారుడు సుశ్విత్ రెడ్డి (ఎన్ఆర్ఐ) ఆర్థిక సహకారంతో నిరుపేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందిస్తున్నట్లు తెలిపారు. సింధూజ ఉన్నత చదువులు చదివి జీవితంలో రాణించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పాదూరి ఇంద్రసేనారెడ్డి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.