దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 04 : ప్రభుత్వ కళాశాల జేఎల్స్కి అదేవిధంగా, పాఠశాల ప్రిన్సిపాల్స్ కి గెజిటెడ్ హోదా ఉంది కానీ, అనునిత్యం అందుబాటులో ఉంటున్న తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌కి, కళాశాలలోని జేఎల్ కి గెజిటెడ్ హోదా లేదని, వారికి కూడా గెజిటెడ్ హోదా కల్పించాలని గురుకుల టీచర్స్ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షుడు కొండ్రపల్లి శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు 24 గంటలు హాస్టల్స్‌లోనే ఉంటారని, వారి ఆలనా పాలనను అక్కడి ప్రిన్సిపాల్స్, జేఎల్స్ తమ కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తూ చూసుకుంటారన్నారు. కావున అటువంటి వారిని చిన్నచూపు చూడకుండా, వివక్షత చూపకుండా వారి సేవలను గుర్తించి గెజిటెడ్ హోదా కల్పించాలని పేర్కొన్నారు.