కేసీఆర్ పాలన.. రైతులకు స్వర్ణయుగం
‘కేసీఆర్ పాలన స్వర్ణయుగం, కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశాం.మళ్లీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి’ అని రైతులు, ప్రజలు కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
- జిల్లా మంత్రుల అవినీతి బట్టబయలైంది
- కేరళ ఎన్నికలకు తెలంగాణ నుంచే డబ్బులు
- మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
తిరుమలగిరి ఫిబ్రవరి 27 : ‘కేసీఆర్ పాలన స్వర్ణయుగం, కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశాం.మళ్లీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి’ అని రైతులు, ప్రజలు కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలగిరిలో నూతన మున్సిపాల్టీ పాలక వర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో మం త్రుల అవినీతి బట్టబయలైందని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైసు మిల్లర్లపై విరుచుకుపడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పరిపాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. రైతు బంధు ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపాలని ప్రభుత్వం నిధులు సమీకరిస్తున్నదన్నారు. దేశంలోనే ఎక్కువ మొత్తంలో పంటలు పండించి రికార్డు సృష్టించిది..నల్లగొండ జిల్లాయే అన్నారు.
పదేళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కరోనా సమయంలో సైతం కేసీఆర్ రైతులను ఆదుకున్నారని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా దళారులు, దోపిడీదారుల కొమ్ము కాస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని, దీంతో ప్రజలు మళ్లి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులకు స్వర్ణయుగమ అన్నారు. నాడు కేసీఆర్ హయాంలో సంతోషంగా ఉన్న అన్నదాతలు నేడు అరిగోస పడుతున్నారని అన్నారు.
కనీసం యూరియా, కరెంట్, నీళ్లు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అన్నారు. కార్యక్రమానికి ముందు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా వరకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని స్థానికులకు అభివాదం చేసారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి , మా జీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమా ర్ , కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాద వ్, నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి, యాదా ద్రి జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి ,గుజ్జ యుగేందర్‌రావు, నేవూరి ధర్మేందర్‌రెడ్డి ,బీఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

