సూర్యాపేట, ఆగస్టు 16 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నా నలుగురికి మాత్రమే నాలుగు కిలోల బియ్యం ఇచ్చేవార ని, తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎం కేసీఆర్ కార్డు లో ఉన్న అందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేశారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివా రం ఆయన జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తదితరులతో కలసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మం జూరీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. రైతు రుణమాఫీ కొంత మందికే అ యిందని మిగతా వారికి కూడా పూర్తిగా అందించాలన్నారు. సన్న వడ్లకు మద్దతు ధర రైతులందరి కీ ఇవ్వాలన్నారు. ప్రధానంగా కాళేశ్వరం నీళ్ళను చివరి ఆయకట్టు రైతుల పంట పొలాలకు అందించాలని, మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ 2500, స్కూటీలు ఇవ్వాలన్నారు.
ఆడ పిల్ల పెళ్లికి రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని, ఆ సరా పెన్షన్ రూ 4వేలకు పెంచి ఇవ్వాలని అన్నా రు. నిరుద్యోగ భృతితో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న ఉద్యోగాలు సకాలంలో ఇవ్వాలని ఇచ్చిన హామీల న్నీ అమలు చేస్తే ప్రజలు తప్పకుండా సంతోషిస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ రేషన్‌కార్డులు రాని వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కొత్త కార్డుకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అర్హత ఉంటే తాసీల్దార్ పరిశీలించి కార్డు మంజూరు చేస్తారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ధేశించిన కొలతల ప్రకారం 400 నుంచి 600ల చదరపు అడుగుల్లోనే ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, సూ ర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబుఆర్డీఓ వేణుమాధవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డీఎస్ఓమోహన్బాబు, హౌజింగ్ పీడీ సిదా ్ధర్థ, డీఈ జబ్బార్ అహ్మద్,ఏఈ రాంబాబు ,హౌసిం గ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.