కోదాడ, సెప్టెంబర్ 15 : భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేసిందని ఆ సంఘం కోదాడ అధ్యక్షుడు కంజుల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంలో ప్రభుత్వం ఇన్సూరెన్స్ పై జిఎస్టి రద్దు చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బ్రాంచ్ మేనేజర్ రమేష్ రెడ్డి, ఏజెంట్లతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం పక్షాన ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు జిఎస్టి రద్దుకై రాజీలేని పోరాటాలు చేశామని చెప్పారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ జాయింట్ సెక్రెటరీ కొప్పోజు సూర్యనారాయణ, బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి వట్టికూటి మల్లేష్, కోశాధికారి సొందు మియా, మేనేజర్ రమేష్ రెడ్డి, రాము, సైదులు, కన్నయ్య, శంకర్, కంబాల శ్రీనివాస్, సైదిరెడ్డి, బొడ్ల మదన్మోహన్ రావు, గురుమూర్తి, అహ్మద్ అలీ, కడారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.