బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ
మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావు బహుము ఖ ప్రజ్ఞాశాలి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పీవీ వర్ధంతిని నిర్వహించారు.
- శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
- నల్లగొండలో పీవీ చిత్రపటానికి ఘన నివాళి
రామగిరి, డిసెంబర్ 23 : మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావు బహుము ఖ ప్రజ్ఞాశాలి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పీవీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ పీవీ నర్సింహారావు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడే గొప్ప మేధావి అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎనలేని సేవ చేశారని తెలిపారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పెంచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కనగల్ జడ్పీ టీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్వామిగౌడ్, గోపాల్రెడ్డి, వెంకటేశ్వర్రావు, హరికృష్ణ, దైద రజితారెడ్డి, రామలచ్చయ్య, వెంకన్న, శ్రీనివాస్, కేశవరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

