చిలుకూరు, జూన్ 8 : మండల కేంద్రంలోని చిలుకూరులో నూతన కంఠమహేశ్వరస్వామి, సురమాంబ దేవి విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవాన్ని ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దేవాలయాలను నిర్మించడం మన సంస్కృతికి నిదర్శనం అని అన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మహిళలు బోనాలతో తరలివచ్చి స్వామి వారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.