పెన్పహాడ్, నవంబర్ 25 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, ధర్మపురం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ లాలూ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, పీసీసీ కార్యదర్శి తూముల భుజంగరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తూముల సురేశ్రావు, మార్కెట్ కమిటీ డెరైక్టర్ ఆర్తి కేశవులు. ఏపీఎం అంజయ్య, మాజీ ఎంపీటీసీ పవన్, ఖమ్మంపాటి నాగరాజు, శ్రీధర్, వీబీకేలు, సంఘ బంధం అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు.