కట్టంగూర్, ఏప్రిల్ 09 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ అన్నారు. మండలంలోని పందనపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ఏ గ్రేడ్ కు రూ.2,320, బి గ్రేడ్ కు రూ.2,300 మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞాన ప్రకాశ్‌రావు, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, వ్యవసాయశాఖ అధికారి గిరి ప్రసాద్, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేశ్, బండారు కృష్ణ, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి కానుగు సైదమ్మ, నాయకులు కుంభం అనిల్ రెడ్డి, గోదల వెంకట్ రెడ్డి, గద్దపాటి రాములు, అయితగోని నారాయణ, మిట్టపల్లి శివ, రెడ్డిపల్లి వీరస్వామి, అయితగోని నర్సింహ్మ, బుచ్చాల వెంకన్న, మర్రి రాజు, గోశిక అంజన్ కుమార్, కొంపెల్లి శ్రీకాంత్, కానుగు లింగయ్య, గుండు శేఖర్ పాల్గొన్నారు.