చండూరు, మే 05 : నిర్వాహకులు త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల, చండూరు, గుండ్రపల్లి, బంగారిగడ్డ, పుల్లెంల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం సన్న రకాలకు రూ.500 బోనస్ చెల్లిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.
కొనుగోళ్లు చేసిన దాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను గురించి అధికారులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 60 లారీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోరిమి ఓంకారం, డైరెక్టర్లు భూతరాజు ఆంజనేయులు, తలారి నరసింహ, నలపరాజు రామలింగయ్య పాల్గొన్నారు.