తిరుమలగిరి మే 5: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రా మంలోని రైతులు మంగళవారం వలిగొండ, తొ ర్రూర్ రహదారిపై ధర్నా ని ర్వహించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడం తో అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులకు నచ్చజెప్పటంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం పోసి, నెలలు గుడుస్తున్నా అధికారులు కాంటాలు వేయక పోవటంతో ఆదివారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి నల్లబారిందన్నారు. ధాన్యాన్ని కాంటాలు వేయకుండా రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉంచితే అకాల వర్షాలుపడి ఆగం చేశాయన్నారు. దీనికి బాధ్యులు ఎవరని అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొనుగోలు కేంద్రాల్లో రైతులు గోస పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ప్రతీ సీజన్లో రైతులు ధాన్యం అమ్ముకోవటానికి నానా తం టాలు పడాల్సి వస్తోందని రైతులు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు హాయిగా ధాన్యం విక్రయించి, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వ్యవసాయం చేసుకునే వారమన్నారు.
తిరుమలగిరి మండలంలోని కోట్యానాయక్ గ్రామ పంచాయతీ పరిధిలోని డెయిరీ ఫెడ్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసుకున్న స్థలంలో రైతుల నుంచి బస్తాకు రూపాయి వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
తిరుమలగిరి మండలంలో 4 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నాయని రైతులు పేర్కొన్నారు. వీటిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెల దాటినా ఇప్పటి వరకు కేవలం 14 వేలు మాత్రమే కాంటాలు వేశారన్నారు. వీటిలో 12 వేలు మాత్రమే మిల్లులకు తరలించారని, మరో 50 నుంచి 60 వేల క్వింటాళ్ల ధాన్యం కాంటాలు వేయాల్సి ఉందని రైతులు పేర్కొన్నారు.