కట్టంగూర్, ఏప్రిల్ 25 : ధాన్యం కోనుగోళ్లను వేగవంతం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి డిమాండ్ చేశారు. శనివారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. లారీ కొరతతో కాంటాలు వేయడం లేదని రైతులు తెలుపడంతో అక్కడే వారితో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, మిల్లర్ల నిర్లక్ష్యంతో కొనుగోళ్ల ప్రక్రియ మందగించిందని విమర్శించారు.
వారానికి ఒక లారీ కూడా ధాన్యం ఎగుమతి కావడం లేదని, అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిచి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లను చేపట్టకపోతే సోమవారం తాసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు గంగనబోయిన వీరాంజనేయులు, అఖిల భారత రైతు కూలీ సంఘం బూరుగు సత్తయ్య, నిమ్మనగోటి రాములు, చిలుముల సాయిలు, గంట రాములు, వల్లపు వెంకన్న, గద్దగూటి సత్తయ్య, పిచ్చమ్మ, సైదమ్మ, మల్లేశ్వరీ, నాగమ్మ, సైదులు పాల్గొన్నారు.