అర్వపల్లి, ఏప్రిల్ 22 : ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాణ్యతండా, వేల్పుచర్ల, బొల్లంపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మధ్యవర్తుల చేతుల్లో రైతులు మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాంబాబు, సీసీ నాగార్జున, సర్పంచులు అంకిరెడ్డి వీరాంజనేయులు, కేలోతు కాంతమ్మ హరిలాల్, చెరుకు వెంకటమ్మ, ఉప సర్పంచ్ పున్నయ్య, రెడ్యానాయక్, మంజుల, సరిత, యాదగిరి, రంగయ్య పాల్గొన్నారు.