జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అనేది ప్రహసనంలా కొనసాగుతున్నది. నత్తే సిగ్గు పడేంతగా కొనుగోళ్ల వ్యవహారం నడుస్తున్నది. వాన కాలం సీజన్ ప్రారంభమైనా.. యాసంగిలో పండిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. సర్కారు అలక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం వర్షంలో తడిసింది. ధాన్యమంతా తడిసింది. ధాన్యం మొలకెత్తి ఐకేపీ కేంద్రాలన్నీ నారుమళ్లను తలపిస్తున్నాయి. వందలాది మంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో 286 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇంకా 116 కేంద్రాల్లో ధాన్యం ఉంది.
సూర్యాపేట, మే 31 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో కర్షకులు కష్టాలు పడుతున్నారు. రైతులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేపట్టిన పథకాలను కూడా కొనసాగించడం లేదు. రైతు భరోసా ఎగ్గొట్టడం… రుణమాఫీ చేయకపోవడం… నిర్వహణ లోపంతో సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్లు బంద్ కావడంతో పెద్దఎత్తున పంటలు ఎండిపోయిన విష యం తెలిసిందే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక రకాలుగా నష్టపోతూ గత ఉమ్మడి రాష్ట్రంలోని కష్టాలు పునరా వృతం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే యాసంగి సీజన్ కోతలు పూర్తయి రెండు నెలలు గడిచినా ప్రభుత్వ నిర్వాకమో… అధికారుల నిర్లక్ష్యమో కానీ ఇంకా 116 ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో రైతుల పంట ఉంది. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోనే సెం టర్లు తెరిచే ఉన్నాయి.
జిల్లాలో ధాన్యం కొ నుగోళ్లు ఆలస్యం కావడంతో కొద్ది రోజులుగా వర్షాలు కురిసి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి మొలకలెత్తి నారుమళ్లుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 4,73,739 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా మార్చి మొదటి వా రంలోనే పంట చేతికి వచ్చింది. కానీ కొనుగోలు కేంద్రాలను మాత్రం ఆలస్యంగా ప్రారంభించారు. రైతులు పం డించిన పంట దాదాపు 50శాతం తమ ధాన్యాన్ని ప్రైవేట్ మార్కెట్లో విక్రయించుకున్న తరువాత దాదాపు నెల రోజుల ఆలస్యంగా అంటే ఏప్రిల్ 12న కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించారు. జిల్లాలో 286 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయగా జిల్లా వ్యాప్తంగా దాదా పు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అం చనాలు ఉండగా ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఇంకా 116 కొనుగోలు కేంద్రాలలో దాదాపు 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారుల అం చనాలు ఉన్నాయి.
చాలాచోట్ల రైతులు ధాన్యాన్ని ప్రభు త్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రెండునెలలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో నానా ఇబ్బందులకు గురౌతున్నారు. ఎండకు ఎండుతూ… వానకు తడుస్తూ ధాన్యం రాసులకు కాపలా ఉంటున్నారు. గత్యంతరం కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయిన వేలాది మంది రైతులు తమ ధాన్యాన్ని ఎత్తుకొని ప్రైవేట్ మార్కెట్లో విక్రయించుకున్నారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కొనుగోలు చేయకపోవడంపై రైతులు ప్రభుత్వంన్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై ఇన్చార్జి జిల్లా సైప్లె అధికారి శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా వర్షాల కారణంగా కాస్త ఆలస్యం అవుతుందని, మరో రెండుమూడు రోజుల్లో కొనుగోళ్లన్నీ పూర్తి చేసి సెంటర్లన్నింటినీ మూసి వేస్తామన్నారు.