– ఇస్మాయిల్పల్లిలో జీపీ భవనానికి శంకుస్థాపన
కట్టంగూర్, ఆగస్టు 22 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో 20 నెలల కాలంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఊరురా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇండ్లు, జీపీ, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తునట్లు తెలిపారు.
ఎరువుల కొరత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సృష్టంచిందేనని, ప్రతి రైతుకు తగినంతా యూరియా అందజేస్తామన్నారు. అనంతరం నూతన బోరు మోటారును స్వీచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సతీశ్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, ఎంపీఓ స్వరుపారాణి, పీఆర్ జేఈ జలీల్, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మాజీ సర్పంచ్ పులిగిల్ల అంజయ్య, ఏపీఓ కడెం రాంమోహన్, నాయకులు రెడ్డిపల్లి సాగర్, అయితగోని నర్సింహ్మ, చౌగోని సాయిలు, మాద లింగస్వామి, ముక్కాముల శేఖర్, అజయ్ కుమార్ రెడ్డి, గాలి కృష్ణ, పెంజర్ల రవి, నాగరాజు, మాద సైదులు, తుమ్మల లింగారెడ్డి, మాద శంకర్, మాద భాస్కర్, పెంజర్ల నరేందర్, జానకిరెడ్డి, అనిల్ రెడ్డి, నంద్యాల వెంకట్ రెడ్డి, బుచ్చా వెంకన్న, గుండు పరమేశ్ పాల్గొన్నారు.