ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాల
నల్లగొండ రూరల్, జూన్ 9 : సర్కారు బడులను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దీంతో కార్పొరేటుకు దీటుగా రూపుదిద్దుకోనున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి, అనంతారం, నర్సింగ్‌భట్ల, దోమలపల్లి, కంచనపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దోమలపల్లి, కంచనపల్లి గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంభించి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచులు భాద్యతగా వ్యవహరించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. కార్యక్రమాలల్లో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సుమన్, ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ నరసింహ, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, బకరం వెంకన్న, పీఏసీఏస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ జిల్లాపల్లి పరమేశ్, ఎంపీటీసీలు రాజుపేట మల్లేశ్‌గౌడ్, సహదేవులు, సర్పంచులు ఈగల శైలజాలక్ష్మారెడ్డి, మన్నె కృష్ణార్జున్‌రెడ్డి, మామిడి వీరమణి, చామకూరి తేజస్వినీతిరుమలేశ్, బైరెడ్డి వెంకట్‌రెడ్డి, జాన్‌రెడ్డి, మామిడి కేథార్, తవిట కృష్ణ, ఏఆర్ఐ అమర్నాథ్రెడ్డి, సమీర్ కుమార్, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.