భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 9 : రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులందరికీ రూ.2లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణ మాఫీ చేయాలని, సాగులో ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వర్షాలు, వడగండ్లకు పంట నష్టపోయిన రైతులకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరారు. గుండాల మండలం షాపురం-వంగాల మధ్య ఉన్న అసంపూర్తిగా ఉన్న కాల్వను పూర్తి చేసి నవాబుపేట రిజర్వాయర్ ద్వారా తాగునీరు అందించాలన్నారు. ప్రధాన మంత్రి మోదీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు పంటలకు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం అమలు చేయాలని కోరారు. జాతీయ వ్యవసాయ మారెట్ విధానం విరమించుకోవాలని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని 6 వేల నుంచి 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి జగన్మోహన్ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో రైతు సంభం జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పుల కొమురయ్య, ఎలగందుల అంజ య్య, జిల్లా సహాయ కార్యదర్శి జక దయాకర్ రెడ్డి, నాయకులు నరికే యాదయ్య, తెడ్డు ఆంజనేయులు, బోదాసు స్వామి, గుర్రం పద్మా రెడ్డి, ఏనుగు మల్లారెడి,్డ సోమన ఐలయ్య, కూర వెంకటేశ్, ఎనగండ్ల రాజప్ప పాల్గొన్నారు.