రామన్నపేట, అక్టోబర్ 17 : రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీమానాయక్, వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, తాసీల్దార్ లాల్‌బహదూర్, ఏపీఓ జానిమియా, నాయకులు గుత్తా నర్సిరెడ్డి, వనం చంద్రశేఖర్, రామిని రమేశ్ పాల్గొన్నారు.