యాదగిరిగుట్ట, ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వంగపల్లి గ్రామంలో జాతీయ రహదారి పక్కనే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం గోడలకు ‘చలో వరంగల్’ ‘జై కేసీఆర్’, ‘జైజై బీఆర్ఎస్’ అంటూ పెయింటింగ్ రాస్తూ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనివినీ ఎరుగని రీతిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. ఊరూరా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రేపాక స్వామి, మాజీ వార్డు సభ్యుడు బొట్టు రాజుగౌడ్ పాల్గొన్నారు.