యాదగిరిగుట్ట, జూన్ 25: కేవలం 16 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ కావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామన్న భావనలో ఉన్నారన్నారు. బుధవారం పట్టణంలోని గొంగిడి నిలయంలో ఆత్మకూరు(ఎం) మండలంలోని సింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు చెంగోజు రామాచారి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, అంతమాత్రాన ప్రజల్లో విశ్వాస్వాన్ని కోల్పోయిన్నట్లుగా భావించవద్దన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ప్రజలు విశ్వశనీయత కొల్పోలేదని స్ప ష్టం చేశారు. కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల్లో నిలబడే నాయకులకు మద్దతుగా నిలిచి వారికి గెలిపించుకునేలా అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ము ఖ్యంగా రైతుల పక్షపాతిగా కేసీఆర్ తీసుకున్న సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్‌ను ఆ పార్టీ నాయకులే అసహించుకుంటున్నారని, ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చలేక సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని మహేందరెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా విజయోత్సవ సభ ఎందుకు పెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కొప్పుల హరిదీప్‌రెడ్డి, జిల్లా నాయకుడు యాస ఇంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి, ఆత్మకూరు(ఎం) మండల యువజన విభా గం అధ్యక్షుడు ప్రతికంఠం శాంతన్రాజు, విద్యార్థి విభాగం నియోజకవర్గ నాయకుడు నాతి మల్లికార్జున్ గౌడ్, గట్టు విశాల్, పంజాల రాజుగౌడ్, లోడి ప్రదీప్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పన్నాల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పల్లెర్ల సత్యనారాయణ, కొలను అంజిరెడ్డి, వల్లాల రాములు, బత్తిని లక్ష్మీనారాయణ, మందుల పరుశురాములు, బొల్లెపల్లి శ్రీహరి, కొప్పుల శ్రీనివాస్‌రెడ్డి, భూత రాజు, చంద్రయ్య, కొలను కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, భిక్షపతి, కిష్టయ్య, కృష్ణంరాజు, రాజు, అనిల్, గణేశ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.