Thungathurthy : ‘అన్నారంను హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’
తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు..
– సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
తుంగతుర్తి, జనవరి 23 : తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని వివరించారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేశ్, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు సభ్యులు కడారి సుకన్య, మరికంటి జానకమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ మోతే చంద్రకళ, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

