రామగిరి, జూన్ 12: తెలంగాణలో ఎం బీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ ఐసెట్-2026 ఫలితాలు శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి టీజీ ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవితో కలిసి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 13, 14న నిర్వహించిన పరీక్షలకు 51,146 మంది అభ్యర్థులు హాజరుకాగా 46, 654 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో ఈ పర్యాయం బాలుర కంటే బాలికలే ముందజంలో ఉన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండో పర్యాయం పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిన ఎంజీయూను అభినందించారు. ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన దుగ్గె శిశిధర్ రాష్ట్ర వ్యాప్తంగా 11వ ర్యాంకు సాధించారు. టీజీ ఐసెట్ కో కన్వీనర్ మిర్యాల రమేశ్, ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.
టీజీ ఐసెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 56, 206 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 51,146 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా 46,654 మంది ఉత్తీర్ణత సాధించగా 91.22 శాతం ఫలితాలు వచ్చా యి. పరీక్షలకు హాజరైన 51,146 మం దిలో 23,353 మంది బాలురు, 27,793 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 21,191 మంది బాలురు, 35,463 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు.
టీజీ ఐసెట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరులమగిరి సారగ్ మండలం రాజవరం గ్రామానికి చెందిన దుగ్గె శశిధర్ రాష్ట్ర వ్యాప్తంగా 145.98 శాతం మా ర్కులు సాధించి 11వ ర్యాంకు సాధించారు. ఫలితాలను icet.tgche. ac.in లో అందుబాటులో ఉంచారు.