బీఆర్ఎస్ హయాంలోనే నల్లగొండ అభివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండ అభివృద్ధి చెందిదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే రూ. 1600 కోట్లతో నల్లగొండను సుందర నగరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని 5,6,11,40 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచార చేశారు.
- కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరేస్తాం
- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నీలగిరి, ఫిబ్రవరి 5. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండ అభివృద్ధి చెందిదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే రూ. 1600 కోట్లతో నల్లగొండను సుందర నగరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని 5,6,11,40 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచార చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పట్టణాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి ఉన్నప్పుడు ఐటీ హబ్ నిర్మించి 25 కంపెనీలను నల్లగొండకు రప్పించి, యువకులకు ఉద్యోగాలు ఇప్పించారన్నారు. డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, మోడ్రన్ వైకుంఠ ధామాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మారెట్, విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి, పారులు, ఓపెన్ జిమ్‌లు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో, మంత్రి కోమటిరెడ్డి నల్లగొండకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించి, అవసరం లేని చోట్ల రోడ్లు నిర్మాణం చేపట్టి, కమీషన్లు దండుకున్నారే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
కేసీఆర్ హయాంలో ప్రతి ఇంట్లో సంక్షేమం.. ప్రతి కంట్లో సంతోషం కనిపిస్తే.. కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రతి ఇంట్లో సంక్షోభం.. ప్రతి కంట్లో విషాదం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించి కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జిల్లా శంకర్, అభ్యర్థులు కంబాలపల్లి కృష్ణ, కందుల లక్ష్మయ్య, బొమ్మర బోయిన నాగార్జున, అభ్యర్థులు పున్నా రాజేశ్వరి వెంకన్న, కుందూరు దీపికా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దండంపల్లి సత్తయ్య, గంగుల దీప్తీ వంశీచంద్, నల్లగొండ అశోక్, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

