– సూర్యాపేట కలెక్టర్‌కు కోదాడ కౌన్సిలర్ గోపి వినతి
కోదాడ, మే 02 : కోదాడ పట్టణంలోని తమ్మర మూడవ వార్డులో గల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ వంగూరి గోపి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌ను కోరారు. శనివారం కోదాడ పట్టణంలో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, పాఠశాల భద్రత కోసం ప్రహరీ నిర్మాణం, వంటగది నిర్మాణ ఆవశ్యకతను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కౌన్సిలర్ విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే వంటగది, ప్రహరీ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.