– కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ
కోదాడ, ఏప్రిల్ 27 : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని 34వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్రపాండు సహకారంతో కుర్రి సీతారాములు జ్ఞాపకార్థం ఆయన 10వ వర్ధంతి సందర్భంగా యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో దాదాపు 400 మందికి అన్ని రకాల వ్యాధులతో పాటు షుగర్, బీపీ, ఈసీజీ, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. లయన్స్ కంటి ఆసుపత్రి వారిచే కంటి పరీక్షలు చేసి మందులు అందించడంతో పాటు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
సామాజిక సేవలో స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల తో పాటు వైద్యులను శాలువా, పూలబొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్లు నాగేశ్వరరావు, వంగూరి గోపి, తోట శ్రీను, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్, ఓరుగంటి కిట్టు, గుండెపంగు రమేష్, కాంపాటి పుల్లయ్య, ఏర్పుల తిరుప్, శ్రావణ్, కుర్రి నాగరాజు, కుర్రి శ్రీను, కుర్రి వెంకమ్మ, కుడుముల శ్రీను, వంశీ, హేమావతి, చిట్టిప్రోలు నారాయణ పాల్గొన్నారు.