‘ఉచిత వైద్య సేవలు అభినందనీయం’
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీ..
– మున్సిపల్ చైర్మన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, ఏప్రిల్ 24 : నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీ 1వ వార్డులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, స్థానిక కౌన్సిలర్ సామినేని రజని, నరేష్ లతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. యశోద ఆసుపత్రి వైద్యులు 300 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించగా, సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారిని సూర్యాపేటకు తీసుకువెళ్లారు.
ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం గొప్ప విషయమని అందుకుగాను ఎంతో సేవ చేస్తున్న స్థానిక కౌన్సిలర్ సామినేని రజని, నరేష్, ట్రస్ట్ సభ్యులను కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్,ఓరుగంటి కిట్టు, దేవరశెట్టి వెంకటేశ్వరరావు, కాలంగి వెంకటేశ్వర్లు, కందిబండ నాగేశ్వరరావు, వంకాయల ప్రసాద్, గుడుగుంట్ల సాయి, వెంపటి ప్రసాద్, వంకాయల స్వాతి, వంగవీటి రామారావు, వెంపటి వెంకటరమణ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

