చివ్వేంల, మార్చి 21 : మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం అని చివ్వెంల ఎంపిడిఓ సంతోశ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండమీది చందుపట్లలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ద్వారా మట్టి కుండల్లో చల్లటి నీళ్లు అందించడం ఆరోగ్యకరం అన్నారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున నీటిని వృథా చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లయ్య, మాజీ సర్పంచ్ కృష్ణవేణి, ముద్దం వెంకన్న, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.