నకిరేకల్, ఆగస్టు 30 : రాష్ట్రంలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకంతో గౌరవ భృతిని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని పెంచారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్ నైజమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. నకిరేకల్ పట్టణంలో రూ.15లక్షలతో నిర్మించనున్న బ్రాహ్మణ భవన నిర్మాణానికి శ్రీ గాయత్రీ బ్రాహ్మణ వైదిక పరిషత్ నకిరేకల్ ఆధ్వర్యంలో బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ దైవ సమానులైన అర్చకులను కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దైవాంశసంభూతడు కనుకే గౌరవభృతిని పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీడీఎన్ పథకం కింద అర్చకులకు రూ.2500 ఇచ్చిన వేతనాన్ని సీఎం కేసీఆర్ రూ.10వేలకు పెంచారని కొనియాడారు. రాష్ట్రంలో 1805 ఆలయాలకు మాత్రమే ఉన్న డీడీఎన్ పథకాన్ని సీఎం కేసీఆర్ 6,541 ఆలయాలకు పెంచారని కొనియాడారు.
సీఎం కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అర్చకులు పూజలు చేయడంపై సంతోషం వ్యక్తంచేశారు. అర్చకులు, అర్చక ఉద్యోగులు సీఎం కేసీఆర్ గెలుపులో భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యేను అర్చకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, దళిత బంధు కోఆర్డినేటర్ పరమేశం, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు పగిడిమర్రి వెంకటేశ్వర శర్మ, ప్రధాన కార్యదర్శి మధుశర్మ, సభ్యులు కాటేపల్లి శ్రీనివాసశర్మ, వావిలాల నాగఫణిశర్మ, ఎన్.కృష్ణ, చంద్రమౌళి, వావిలాల రామలింగయ్య, నవీన్, సూరి, ఎన్.సోమేశ్వర్శర్మ, ఆనం ద్, గార్లపాటి మోహన్రావు, కృష్ణమూర్తి, సూరి, సాయి, నాగభరద్వాజ్ పాల్గొన్నారు.