నిడమనూరు, ఆగస్టు 04 : నిడమనూరు మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ పథకం పక్కా ఇండ్ల నిర్మాణాలకు నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇండ్లు నిర్మించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పాల్వాయి శేఖర్ రెడ్డి, నాయకులు ముంగి శివ మారయ్య, కొండా శ్రీనివాసరెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, పుట్ట మధుసూదన్ రెడ్డి, సిద్దునూరు వెంకటేశ్వర్లు, వట్టికోటి రవి పాల్గొన్నారు.