గుర్రంపోడ్, జూలై 8:రాష్ట్రంలో ప్రస్తు తం నడుస్తున్నది ప్రజా పాలన కాదని.. పేద ప్రజలను దోచే పాలన అని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కోప్పొలులో ఏర్పాటు చేసిన మండలం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావొస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై అవగాహన లేదని, కనీసం గుంపు మేస్త్రీ పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారని ధ్వజమెత్తా రు. రేవంత్ మాటలే తప్ప చేతలకు పనికిరాని కోతల రెడ్డి అని, ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ అని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్రంపోడు మండలంలోని నాయకులు, కార్యకర్త లు సిద్ధంగా ఉండాలన్నారు. నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ చేసిన అభివృ ద్ధే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల పొట్ట కొట్టి కాంగ్రెస్ నేతలు తమ కడుపులు నింపుకుంటున్నారని మండిపడ్డారు.
నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చే యాలో తెలియదు కానీ..దోచుకోవడం మాత్రం కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు సురక్షితంగా ఉన్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం, ప్రశ్నించే గొం తులను అణిచివేయడం జరుగుతోందన్నారు. మండల బీఆర్ఎస్ నాయకులు గ్రామ గ్రామాన తిరిగి కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉందో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎలా ఉందో ప్రజలకు వివరించాలన్నారు. పోయిం ది అధికారం మాత్రమేనని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది గులాబీ జెం డాయేనన్నారు. సాగర్ నియోజకవర్గం లో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.