చండూరు, సెప్టెంబర్ 29 : కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో చండూరు పట్టణ, మండల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఆకాంక్షించారు. దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని భవాని శంకర్ ఆలయంలో పూజలు అందుకుంటున్న కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పలువురు చిన్నారులకు పలకలు, నోట్‌బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లెట్ల మారయ్య, మోగదాల వెంకన్న, దుర్గామాత కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.