దేవరకొండ, అక్టోబర్ 04 : దేవరకొండ పట్టణంలోని కె కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కొలువైన దుర్గామాతను బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గంపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నీల రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, పానుగంటి మల్లయ్య, చేదెళ్ల వెంకటేశ్వర్లు, మాడెం రాములు, వడత్య బాలు, కర్నాటి పురుషోత్తం పాల్గొన్నారు.