హాలియా, జనవరి 29 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 31న నాగార్జున సాగర్‌లో జరిగే బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకుల సమావేశానికి రావాలని ఆహ్వానించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించినట్లు మాజీ ఎమ్మెల్యే భగత్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో జరిగే సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హరిచందనను సోమవారం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ నల్లగొండలోని కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరినట్లు, అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు భగత్ తెలిపారు.