రామగిరి, అక్టోబర్ 01 : నల్లగొండ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ, ఎన్టీఆర్ కాలనీ, న్యూ వీటి కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గా భవాని మండపాల్లో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యంత నిష్ఠ భక్తిశ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారన్నారు. అమ్మవారి ఉత్సవాల్లో ముఖ్యంగా చండీయాగం ప్రధానంగా నిర్వహిస్తారని, ఇది సర్వ మానవాళికి లబ్ధి చేకూర్చే యాగమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ గున్రెడ్డి యుగంధర్ రెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి, లొడంగి గోవర్ధన్, బొజ్జ వెంకన్న, గుండెబోయిన జంగయ్య, బీపంగి కిరణ్, యాదమ్మ మాత, కడారి యాదయ్య, బొజ్జ నాగయ్య, మర్రి మల్లేష్, సుంకరబోయిన రవి, అశోక్, బొజ్జ ఖతర్నాక్ పాల్గొన్నారు.
Ramagiri : నల్లగొండ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు