కనగల్, డిసెంబర్ 18 : కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధి మదనాపురం గ్రామ వార్డు సభ్యుడు కారింగు నర్సింహా తండ్రి ముత్తయ్య గురువారం అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలిసిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మదనాపురం గ్రామానికి వెళ్లి ముత్తయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. నర్సింహ, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆయన వెంట కనగల్, ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పులకరం మారయ్య, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, దోటి వెంకన్న, రామకృష్ణ ఉన్నారు.