కట్టంగూర్, జూన్ 2 : బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామానికి చెందిన రేకల పాపయ్య ఇటీవల ప్రమాద బారిన పడి మృతి చెందాడు. ఆయనకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో రూ.2లక్షల బీమా చెక్కు మంజూరైంది.
సంబంధిత చెక్కును మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మృతుడి భార్య పూలమ్మకు అందజేసి మాట్లాడారు. పార్టీలో పని చేసే వారికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రేకల భిక్షం, పులిగిల్ల వెంకన్న, మేడబోయిన అంజనేయులు, పెంజర్ల ముత్తయ్య, శేఖర్‌రెడ్డి, రేకల సాయి, శ్రవణ్ పాల్గొన్నారు.