నార్కట్‌పల్లి, జూన్ 7: సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఒరగబెట్టింది ఏమీలేదని, కాంగ్రెస్ అం టేనే ఖయ్యాలకు కాలు దువ్వే పార్టీ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం పట్టణకేంద్రంలోని తన నివాసంలో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టాన్ని బీఆర్ఎస్ పదేండ్లు పారదర్శకంగా ముందుకు నడిపిందని, కానీ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. అం దుకే తెలంగాణకు మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
కేవలం తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను తిట్టడానికే సీఎం రేవంత్ ఆలేరులో సభ పెట్టుకున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ స్వాగతం పలికిందే తప్పా.. ఎక్కడా అడ్డుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదన్నారు. గతంలో రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గంధమల్ల్లకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటన్నారు.
కాళేశ్వరం, మల్లన్నసాగర్ లేకుండా గంధమల్లకు నీళ్లు రావనేది కాంగ్రెస్ నాయకుల గ్రహించాలన్నా రు. గతంలో యాదగిరి క్షేత్ర సన్నిధిలో మెడికల్ కళాశాలకు రూ.182 కోట్లు మంజూరు చేసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. మళ్లీ చేసిన పనులకే శంకుస్థాపన చేయడం అనేది సిగ్గుచేటని విమర్శించారు. యాదాద్రిని యాదగిరి గుట్టగా మార్చడాన్ని ఎవరూ స్వాగతించలేదని, కేసీఆర్ పేరు యాదగిరి క్షేత్రంపై సువర్ణాక్షరాలతో చెక్కబడే ఉంటుందన్నారు.
పదేం డ్ల కేసీఆర్ సంపద సృష్టిస్తే కాంగ్రెస్ కొల్లగొడుతుందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని, అందుకే కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దోసపాటి విష్ణుమూర్తి, మాజీ ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య, మాజీ సర్పంచ్ కర్నాటి ఉపేందర్, దుబ్బాక శ్రీధర్, పక్కీర్ సత్తిరెడ్డి, జినుకల కార్తీక్ పాల్గొన్నారు.