రామన్నపేట, సెప్టెంబర్ 3: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య అన్నారు. రామన్నపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలగాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. అనంతరం సుభాష్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చిట్యాల- భువనగిరి రహదారిపై బైఠాయించారు. బలవంతంగా ఆయన ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సం దర్భంగా చిరుమర్తి లింగ య్య మాట్లాడుతూ.. తెలంగాణ రా ష్ర్టాన్ని సాధించి, సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేసిన కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో లోపాయకారి ఒప్పదంతో కేసీఆర్‌కు ఇబ్బందులు కలిగించే ప్రత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల కోసమే కమిషన్ల పేరిట బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ వేధిస్తుందన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు, ప్రజలు తల్లడిల్లుతున్నారని, రైతులకు యూరియా అందించలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, వీరిపై నే సీబీఐ విచారణచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులే రేవంత్‌ను సీఎం పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్‌బాబు, దోమల సతీష్, మాజీ సర్పంచ్‌లు కోళ్లస్వామి, బందెల యాదయ్య, నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేశ్, ఎస్కే చాంద్, మందడి సాగర్‌రెడ్డి, గర్దాసు విక్రం, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, ఆమేర్, మిర్యాల మల్లేశం, అల్లయ, ఆవుల శ్రీధర్, రామిని లక్ష్మణ్, ఆవుల నరేందర్, జెట్టి శివప్రసాద్ పాల్గొన్నారు.