అనంతగిరి, జూన్ 26 : అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హస్తం రాము ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం రాము చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం ఇటీవల గాయపడిన గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు కొండపల్లి ఉపేంద్రను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు ఉన్నారు.