మిర్యాలగూడ, ఏప్రిల్ 20 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా త్వరలో మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షో నిర్వహిస్తారని, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. పార్టీ శ్రేణు లు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ లలితా హాతీరాంనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ బైరం సంపత్, నా యకులు వీరకోటిరెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, పడిగపాటి పెద్దకోటిరెడ్డి, కొత్త మర్రెడ్డి, భీమానాయక్, కుర్ర శ్రీనునాయక్, వీరానాయక్ పాల్గొన్నారు.