చండూరు, సెప్టెంబర్ 18 : చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ బోయపల్లి సురేందర్ గౌడ్, యాదయ్య గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం పరామర్శించారు. సురేందర్ గౌడ్ తల్లి, మాజీ సర్పంచ్ సత్తమ్మ ఇటీవల మృతి చెందడంతో దశ దినకర్మలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంతపు మధుసూదన్ రావు, పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీశ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బొడ్డు సతీశ్ గౌడ్, ఉపాధ్యక్షులు కూరపాటి సుదర్శన్, బోయపల్లి అనంత్ కుమార్, కూరుపాటి లక్ష్మయ్య, తేలుకుంట్ల జానయ్య, బోయపల్లి రమేశ్, ఇరిగి రామన్న, బోడ శ్రీకాంత్, దాసరి వెంకటయ్య పాల్గొన్నారు.