కట్టంగూర్, జూన్ 08 : అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో వారు పాల్గొని మాట్లాడారు. చెట్లు నరికివేయడం, అక్రమ కలప రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవుల పెంపకంలో భాగంగా ప్రజలు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. అడవులను కాపాడుకోవడం ద్వారా భావితరాలకు పర్యావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టె వారి వివరాలను ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి , ఏఎస్ఐ అంజయ్య, ఆర్ఐ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, విద్యుత్ లైన్ మెన్ రవికుమార్, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.