నల్లగొండ, సెప్టెంబర్ 4: కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొం డ జిల్లా మత్స్యశాఖ అధికార చరితా రెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కలెక్టరేట్ సముదాయంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో రూ.20వేల లం చం తీసుకుంటూ అడ్డంగా దొరికారు. కేతెపల్లి మండలంలోని బొప్పారం గ్రామ చెరువు మత్స్య సహకార సొసైటీలో కొత్తగా 17 మంది మత్స్యకారులకు సభ్యత్వం ఇచ్చేందుకు రూ.70 వేలు డిమాండ్ చేసి సదరు సొసైటీ బాద్యుడు శ్రీనివాస్‌తో రూ.50వేలు ఒప్పందం కుదుర్చుకొని గురువారం రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ శరత్చంద్రకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
శుక్రవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పెద్దగా స్కీమ్స్ లేకపోవటంతో చేపలు పట్టుకునే మత్స్యకారులను టార్గెట్ చేసుకొని వసూళ్లకు పాల్పడటం ఆమె లంచగొండి తనానికి నిదర్శనం. అయితే 2016-17 సంవత్సరంలోనూ ఫిష్ సీడ్ స్టాక్ విషయంలో అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో నాడు విజిలెన్స్ కేసు కాగా గురువారం ఏసీబీకి పట్టుబడటంతో ఆఫీస్‌తోపాటు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా 2021లో హైదరాబాద్‌కు బదిలీ అయిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలల్లోనే తిరిగి నల్లగొండకు బదిలీ చేయించుకొని అక్రమ దందాలకు తెరదీస్తూ..ఈసారి సైతం కాంగ్రెస్ నేతలకే సీడ్ కాంట్రాక్ట్ వన్‌సైడ్‌గా అప్పజెప్పడం విశేషం.