తుంగతుర్తి, మార్చి 9 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల 2002-2003 బ్యాచ్ 10వ తరగతికి చెందిన విద్యార్థులు ఆదివారం తమతో చదివి అనారోగ్యంతో మరణించిన మిత్రుల కుటుంబాలకు ఆర్థిక సాహాయం అందజేశారు. స్నేహితులు మదనాచారి, ఎల్లేష్, సంధ్యతో పాటు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు చిత్తలూరి మల్లికార్జున్, అనారోగ్యాన్ని గురైన బీరపుల రవి కుటుంబ సభ్యులకు రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్ కృష్ణయ్య, డైరెక్టర్లు ఎండి నజీర్. కోట వెంకట గోపాల్ పాల్గొన్నారు.