కొండామల్లేపల్లి, నవంబర్ 24 : బీసీ సమాజానికి చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను చట్ట సభల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొండామల్లేపల్లి మండల కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చౌరస్తాలో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్ట సభల్లో అమలయ్యాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, నూతనగంటి ఈశ్వర్, ఏరుకొండ రాము, గిరి వెంకటయ్య, రామస్వామి, కోట్ల జగదీష్, ఎంఏ కైసర్ ఖాన్, బొడిగ శంకర్, పెద్దిశెట్టి సత్యనారాయణ, బీసీ రాజ్యాధికార సమితి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రజనీకాంత్, మండల అధ్యక్షుడు సిలువేరు శ్రీధర్, భూతరాజు భరత్, మల్లేష్, యాదగిరి, నూతనగంటి జగన్, తోటపల్లి వెంకటేష్, బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.