మిర్యాలగూడ, ఆగస్టు 25: మండల పరిధిలోని తడకమళ్ల ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలోని పది పంచాయతీల రైతులు యూరియా కోసం కార్యాలయం ఎదుట బారులు దీరారు. ఆలగడపలో నూ వందలాది మంది రైతులు యూరి యా కోసం వచ్చారు. తడకమళ్ల, ఆలగడప, అన్నారం ప్రాథమిక సహకార కేం ద్రాల వద్ద వందలాది మంది రైతులు ఉదయం 6గంటల నుంచి లైన్లో నిలబడ్డారు. వీరిలో కొంతమందికి మాత్రమే రెండు బస్తాల చొప్పున యూరియా లభించింది.
యూరియా కోసం రైతుల రాస్తారోకో
నిడమనూరు, ఆగస్టు 25: యూరియా ను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిడమనూరు ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులుదీరారు. యూరియా లేదన్న సమాధానంతో ఆగ్రహించిన అన్నదాతలు ప్రధాన రహదారి పై ఆందోళనకు దిగారు. అర్ధగంటకు పైగా రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తక్షణమే యూరియా సరఫరా చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను రైతులకు సంఘీభావం తెలిపారు. సమాచారం అందుకున్న నిడమనూరు ఎస్ఐ సురేశ్, ఏవో మునికృష్ణయ్య రాస్తారోకో ప్రదేశానికి చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడారు. వెనిగండ్లకు 444 బస్తాల యూరియా రావ డంతో 800 మంది రైతులు గోదాం వద్ద కు చేరుకున్నారు. ప్రస్తుత లోడు సూరేపల్లి రైతులకు పంపిణీ చేయాలని డిమాం డ్ చేశారు. రాజన్నగూడెం, వెనిగండ్ల రైతులు గొడవ చేయడంతో పోలీ సులు జోక్యం చేసుకొని అందరికీ ఇచ్చారు.
నార్కట్‌పల్లి ఆగస్టు 25: మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ సంఘం కార్యాలయం వద్ద యూ రియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర యూరి యా సరిపోక రైతులు ప్రైవేటు దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. అదునుకు యూరియా వేయకుంటే నష్టపోతామని రైతుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెల్లవారుజామున 5 గంటల నుంచే…
కోదాడ, ఆగస్టు 25: అనంతగిరి పీఏసీఎస్ ఎదుట బస్తా యూరియా కోసం తెల్లవారుజామున ఐదు గంటలకే పడిగాపులు కాస్తున్న దుస్థితి. గత ప్రభుత్వంలో సమృద్ధిగా యూరియా సరఫరా అయిందని, నేడు ఆ పరిస్థితులకు భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పనులను వదులుకొని గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. పంటలకు యూరియా వేసే తరుణంలో ప్రభుత్వం నిబంధనలు విధించి రైతుకు ఒక బస్తా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. సరిపడా యూరియా అందించాలని రైతులు ఆందోళనకు దిగారు.
పొద్దస్తమానం ఎదురు చూపులే…
కేతేపల్లి, ఆగస్టు 25: మండలపరిధిలోని వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారంపీఏసీఎస్ కేంద్రానికి 444 బస్తాల యూ రియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే పెద్దఎత్తున బారులు దీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళా రైతులు యూరియా కోసం ఎదురు చూశారు. రైతుల తాకిడి పెరగడంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి యూరియాను కిందకు దించారు. అనంతరం ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. 300 మందికి పైగా రైతులు వచ్చారు. దీంతో వచ్చిన యూరియా అందరికీ అందలేదు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా కోసం రైతుల ధర్నా
పెద్దఅడిశర్లపల్లి ఆగస్టు 25: రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వల్లపురెడ్డి అన్నారు. సోమవారం అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏఎమ్మార్పీ ఆయకట్టు కింద అత్యధికంగా వరి సాగవుతున్న తరుణంలో రైతులకు సరిపడా యూరియా అం దడం లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సకాలంలో రైతులకు ఎరువులు అందించామని, కాంగ్రెస్ కమీషన్లు తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవం లేద్నరు. రైతులు ఓ పక్క భూసమస్యలు, మరోపక్క ఎరువుల కోసం వ్యవసాయాన్ని వదిలి మండలకేంద్రాల చూట్టూ తిరగాల్సి వస్తుందన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామావత్ హరినాయక్, మునగాల అంజిరెడ్డి, ఆర్వపల్లి నర్సింహ, రాయినబోయిన శ్రీను, యర్ర యాదగిరి, గోలి గిరి, మహేందర్, దేపావత్ నరేందర్, సుధాకర్,కిషన్ తదితరులు పాల్గొన్నారు.
తెల్లవారక ముందే పడిగాపులు
త్రిపురారం, ఆగస్టు 25: యూరియా కోసం సహకార సంఘాల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులుదీరారు. యూరియా లేకపోవడంతో పంటలు వేసి 20రోజులు దాటుతుంది, పంటలకు మందు వేయాలన్న ఉద్దేశంతో రైతులు సహకార సంఘాల ఎదుట తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చొన్నారు. మహిళలు, పురుషులు ఒకే లైన్‌గా ఉండి గొడవలు పడుతున్నారని తెలుసుకున్న ఎస్ఐ కైగూరి నరేశ్ సిబ్బందిని సహకార సంఘం వద్దకు పంపించడంతో పురుషులు, స్త్రీలను వేర్వేరు లైన్లుగా నిల్చోబెట్టి ప్రతి రైతుకూ మూడు కట్టల యూరియా పంపిణీ చేయించారు. ఏవో, ఏఈవోలు, పీఏసీఎస్ సిబ్బంది, పోలీసుల పర్యవేక్షణలో ఎన్నడూ కూడా ఇంత గోస తీయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెబుతారని రైతులు అంటున్నారు.
యూరియా కోసం క్యూలైన్లో విద్యార్థి
నల్లగొండ, ఆగష్టు 25: ఫొటోలో కనిపిస్తూ క్యూలైన్లో నిల్చున్న విద్యార్థి బడిలో ప్రేయర్ కోసం నిలబడలేదు. ఒక యూరియా బస్తా కోసం నిలబడ్డాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటలు నిలబడ్డా ఒక్క యూరియా బస్తాకూడా సాధించలేకపోయాడు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కేశరాజుపల్లికి చెందిన పాయిలి మిథి లేశ్ 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం పొద్దున్నే పాఠశాలకు పోదామని రెడీ అవుతున్నాడు..పొలం పనులకు వెళ్లేందుకు సిద్ధమైన మిథిలేశ్ తల్లిదండ్రులు మాకు పని ఉంది. రెండు యూరియా బస్తాలు తీసుకురమ్మని సూచించారు. దీంతో యూనిఫామ్‌తో స్కూల్ బ్యాగ్ వేసుకొని జిల్లాకేంద్రంలోని బీటీఎస్‌లో ఉన్న ఎన్డీసీఎమ్ఎస్ వద్ద యూరియా బస్తాల కోసం క్యూలైన్లో నిలబడ్డాడు. లైన్కాస్త పెద్దగా ఉండటంతో వెనక ఉన్న మిథిలేశ్ వరస వచ్చే సరికే ఒక్క బస్తా కూడా రాకపోవటంతో యూరియా దొరకలేదని నిరాశతో తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియచేసి బడికి పరిగెత్తాడు.