కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్నారం. గార్లబాయిగూడెం, కురుమర్తి, కట్టంగూర్..
కట్టంగూర్, ఏప్రిల్ 06 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్నారం. గార్లబాయిగూడెం, కురుమర్తి, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్ల వేగవతంతం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
రైతులు ఆధైర్య పడవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తాసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ పి.జ్ఞానప్రకాశ్ రావు, వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, ఏపీఎం రాములు, ఆయా గ్రామాల సర్పంచ్ లుతేలు సత్తయ్య. దార సత్తెమ్మ, కడారి సంధ్య, కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేష్, బండారు కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, బెజవాడ సైదులు, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, ముత్యాల లింగయ్య. అయితగోని నర్సింహ్మ, అయితగోని ఝాన్సీ, సంఘ బంధం అధ్యక్షులు, సీసీలు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

